సత్యసాయి బాబా ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు

జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ దుప్పట్లు, సైకిళ్లు, కుట్టుమిషన్లు, పేదలకు బియ్యం పంపిణీ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : జగిత్యాల పట్టణంలోని శివవీధిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101,వ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యసాయి బాబా ఆశయాలకు అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, అవసరమైన వారికి సైకిళ్లు, మహిళలకు కుట్టుమిషన్లు, నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలను అడువాల జ్యోతి లక్ష్మణ్ చేతుల మీదుగా నిర్వహించారు....