మీరాలం కుంటకు హైడ్రా రక్షణ కంచె

ఫెన్సింగ్‌ పనులపై రైతుల అభ్యంతరం.. తమ భూములకు నష్టం కలగకుండా న్యాయం చేయాలని వేడుకోలు(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి: చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్‌ అన్నోజిగూడలో ఉన్న మీరాలం కుంటను ఆక్రమణల నుంచి కాపాడేందుకు అధికారులు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు.సుమారు 4 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉన్న మీరాలం కుంట హద్దులను గుర్తించిన అధికారులు, కుంట చుట్టూ రక్షణ కంచె నిర్మాణ పనులు చేపట్టారు. కుంటను ఆక్రమణల నుంచి పరిరక్షించాలని హైడ్రాకు అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది....