నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించండి
పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదుతెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండల కేంద్రంతో పాటు సారంగాపూర్ మండలంలోని సంబంధిత గ్రామపంచాయతీలలో గతంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన రామడుగు సంతోష్ రావు హయాంలో ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల నిర్వహణ, నిర్మాణ పనులు, పారిశుద్ధ్య పనులు తదితర అంశాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మెట్టు ప్రకాష్ సోమవారం జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల నాణ్యత, పనుల నిర్మాణ అంచనాలు, ఖర్చుల వివరాలు, బిల్లులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై సమగ్రంగా పరిశీలన జరపాలని...