కార్మిక హక్కులు రక్షించాలని అంబేద్కర్ కు వినతి
లేబర్ కోడ్ల రద్దుకై చలో ఢిల్లీ---- సిఐటియు తెలంగాణ కెరటం నల్లగొండ జిల్లా ప్రతినిధి: కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రక్షించాలని లేబర్ కోడ్ల రద్దుకై డిసెంబర్ 1 నుండి 3 వరకు చలో పార్లమెంట్ ఢిల్లీ ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు రాష్ట్ర మిటీ పిలుపుమేరకు కార్మిక హక్కులు రక్షించాలని డిఈఓ ఆఫీస్ ఎదురుగా గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సలీంమాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి కార్మికులను బానిసలుగా చేసిందని...