గురువుల ఆశీస్సులు.. స్నేహితుల సందడి.. 27 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన నవాబుపేట్ ZPHS 1997-98 పదో తరగతి బ్యాచ్!

గురువుల ఆశీస్సులు.. స్నేహితుల సందడి.. 27 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన నవాబుపేట్ ZPHS 1997-98 పదో తరగతి బ్యాచ్!వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని ZPHS ఉన్నత పాఠశాలలో 1997-98 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు నవాబుపేటలోని సాయి గార్డెన్స్‌లో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగింది.దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అప్పటి విద్యార్థినీ విద్యార్థులంతా ఒకేచోట చేరి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పాత స్నేహాలను గుర్తు చేసుకుంటూ ఆనందంతో సందడి చేశారు.ఈ వేడుకకు విచ్చేసిన అప్పటి గురువులు, ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికి,...