మిరుదొడ్డిలో ఉచిత కంటి వైద్య శిబిరం -ముఖ్య అతిథిగా హాజరైన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి -కుంట కుటుంబ సభ్యుల సేవాభావం అభినందనీయం – పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప విషయం

దుబ్బాకప్రతినిధి,మిరుదొడ్డి, నవంబర్ 24:(తెలంగాణ కెరటం)మిరుదొడ్డి మండల కేంద్రంలో కుంట జితేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, సౌందర్యల జ్ఞాపకార్థం, ఎల్వీ ప్రసాద్ నేత్ర సంస్థ సహకారంతో, కుంట సుకన్య – గోపాల్ రెడ్డి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శిబిర నిర్వాహకులను అభినందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.తమ ఆత్మీయుల జ్ఞాపకార్థం...