భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం భరోసా -అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి -గ్రామ సర్పంచ్ కొమురె నరేష్

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 23,(తెలంగాణ కెరటం)భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తోందని గ్రామ సర్పంచ్ కొమురె నరేష్ తెలిపారు.ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.గ్రామంలోని 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, రేషన్ కార్డు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. అర్హులైన వారు ఈ...