నిరుపేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా-అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి -గ్రామ సర్పంచ్ కొమురె నరేష్ -ఉపసర్పంచ్ కొండల్ రెడ్డి
దుబ్బాక ప్రతినిధి,నవంబర్ 23:(తెలంగాణ కెరటం)భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ కొమురె నరేష్ తెలిపారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ పథకం భూమిలేని పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, రేషన్ కార్డు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. అర్హులైన వారు ఈ...