ప్రతి గ్రామానికీ ఒక గ్రంథాలయం… యువత భవిష్యత్తుకు జ్ఞానమే పునాది..!-పుస్తక పఠనంతోనే విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, సామాజిక చైతన్యం-తెలంగాణ జన సమితి (TJS) సిద్దిపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కీసరి స్వామి ముదిరాజ్
దుబ్బాకప్రతినిధి, నవంబర్ 24,(తెలంగాణ కెరటం)నేటి యువతకు నిజమైన ఆస్తి డబ్బు కాదు.. జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందించే విజ్ఞాన కేంద్రాలే గ్రంథాలయాలు. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో లైబ్రరీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ జన సమితి (TJS) సిద్దిపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కీసరి స్వామి ముదిరాజ్ పేర్కొన్నారు.ప్రస్తుతం పోటీ ప్రపంచంలో యువత ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే సరిపోదని అన్నారు. సమాజంపై అవగాహన, విషయ పరిజ్ఞానం, ఆలోచనా శక్తి, మంచి చెడులను విశ్లేషించే సామర్థ్యం కూడా అవసరమని తెలిపారు. ఈ లక్షణాలను పెంపొందించడంలో పుస్తక పఠనం, గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని వివరించారు.గ్రంథాలయాల్లో...