పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తా -పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షులుగా ‘అంకం శ్రీకాంత్ ’
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 24,(తెలంగాణ కెరటం)దుబ్బాక పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవరర్గాన్ని మంగళవారం పద్మశాలి సమాజ సంఘం అధ్యక్షులు జిందం గాలయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా అంకం శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా బేతి క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శిగా వడిచర్ల వెంకటేష్, సహాయ కార్యదర్శిగా సిరిగాధ మధు, కోశాధికారిగా కారంపూరి భానులు 2026-28 సంవత్సరాలుగా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు అంకం శ్రీకాంత్ మాట్లాడుతూ... పద్మశాలి యువజన సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పద్మశాలిల సమస్యలపై పరిష్కారం కోసం ముందుంటానని తెలిపారు. జియో ట్యాగు సంబంధం లేకుండా చేనేత కార్మికులకు పెన్షన్ అమలు చేయాలని అన్నారు.రాష్ట్ర...