భార్యపై అనుమానం.. ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి

భార్యపై అనుమానం.. ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి - అల్లుడు రాజేష్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24: భార్యపై అనుమానం,ఆస్తి వివాదం నేపథ్యంలో అత్తపై అల్లుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో జరిగింది.ఈ ఘటన మల్లంపల్లిలో కలకలం రేపింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్త బత్తిని లక్ష్మి(60) హన్మ కొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మల్లంపల్లికి చెందిన దూమల రాజేష్(37)కు బత్తిని మానసతో 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న...