వ్యక్తిగత సమాచారం పేరుతో ఆర్టీఐ దరఖాస్తులను పూర్తిగా తిరస్కరించరాదు

వ్యక్తిగత సమాచారం పేరుతో ఆర్టీఐ దరఖాస్తులను పూర్తిగా తిరస్కరించరాదు సెక్షన్ 10(1), 8(2) నిబంధనలను వినియోగించుకోవాలి హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 24 సమాచార హక్కు చట్టం–2005 కింద కోరిన సమాచారంలో వ్యక్తిగత వివరాలు ఉన్నాయనే కారణంతో మొత్తం సమాచారాన్ని నిరాకరించవద్దని కుమార్ పల్లెబోయిన సూచించారు. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023లోని సెక్షన్ 44(3) ద్వారా ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జె) సవరించబడిందని, ఈ మార్పు 2025 నవంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. అయితే సెక్షన్ 10(1) ప్రకారం రికార్డులో మినహాయింపుకు గురయ్యే వ్యక్తిగత సమాచారాన్ని మిగిలిన వివరాల నుంచి వేరు చేయడం సాధ్యమైతే, మిగతా సమాచారాన్ని అందించవచ్చని వివరించారు....