గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి పర్వదినాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు – చిట్టెంపల్లి బాలరాజ్

గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి పర్వదినాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు – చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా: గురు నానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి పర్వదినాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన పర్వదినాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.సిక్కు మత గురువులలో విశిష్ట స్థానాన్ని కలిగిన గురు నానక్ దేవ్ జీ బోధించిన సమానత్వం, మానవత్వం, సేవాభావం, సోదరభావం వంటి గొప్ప విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు....