నందిపేట్ మండల కేంద్రంలో ఘనంగా కార్తీక మాస వేడుకలు

నందిపేట్ మండల కేంద్రంలో ఘనంగా కార్తీక మాస వేడుకలు నిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటంమంగళవారం 24 నందిపేట్ మండల కేంద్రంలోని మంగళవారం రోజున శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కార్తీక మాస వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ మంగి రాములు మహారాజు ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి.కార్తీక మాసం సందర్భంగా ఆశ్రమంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు మరియు సామూహిక దీపారాధన కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నందిపేట్ పరిసర ప్రాంతాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో, భక్తి పారవశ్యంతో మార్మోగింది. వేడుకలకు విచ్చేసిన...