కట్లకుంటలో రోడ్లకు ఇరువైపులా చెట్లకొమ్మల తొలగింపు
కట్లకుంటలో రోడ్లకు ఇరువైపులా చెట్లకొమ్మల తొలగింపు ఆదర్శంగా నిలిచిన గ్రామ మిత్రబృందం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : మేడిపెల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో మేడిపల్లి రహదారికి కిలోమీటర్ మేరకు రోడ్డు పక్కన చెట్లు పెరిగి రోడ్డు వరకు కొమ్మలు రావడంతో, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతో గమనించిన కట్లకుంట గ్రామస్తులు, 07,వ వార్డు సభ్యుడు గోపిరాజు, 10,వ వార్డ్ సభ్యుడు అశోక్ రాజు వారి మిత్రులు తిరుపతి (పొలిటికల్) సంజీవ్ రహీంతో కలిసి స్వచ్ఛందంగా రోడ్డు పక్కన పెరిగి ఇబ్బందికరంగా మారిన చెట్టు కొమ్మలను తొలగించి, ప్రయాణికుల ఇబ్బందులను తీర్చారు. కట్ చేసిన కొమ్మలను తొలగించి, రోడ్డుకు దూరంగా వేశారు....