'సంకల్పం' ఆనందం ఆకాశమంత..

'సంకల్పం' ఆనందం ఆకాశమంత.. ప్రకృతితో మమేకమైతేనే జీవన విలువలు మెరుగుపడుతాయి ఏఆర్‌ ఏసీపీ నర్సయ్య తలసేమియా చిన్నారుల వనభోజనాలలో సందడి ఖమ్మం, నవంబర్ 24 : తలసేమియా చిన్నారుల మల్లెపూల లాంటి చిరునవ్వుల ముందు ప్రకృతి సోయగాలు సైతం కళ్లు చెదిరిపోయాయని.. ఈ వేడుకలతో సంకల్ప సంస్థ ఆనందం ఆకాశాన్ని అంటిందని ఏఆర్‌ ఏసీపీ నర్సయ్య అన్నారు. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి వారి మామిడి తోటలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు ఆడిపాడారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. అనంతరం సంకల్ప సంస్థ ఫౌండర్‌ పి.అనిత అధ్యక్షతన జరిగిన...