వేయింగ్ స్కేల్ తూకంలో మోసానికి పాల్పడుతున్న రైస్ మిల్లర్..!
వేయింగ్ స్కేల్ తూకంలో మోసానికి పాల్పడుతున్న రైస్ మిల్లర్..! ఒక్కో వాహనానికి సుమారు 05 క్వింటాళ్ల వరకు వ్యత్యాసం బట్టబయలు చేసిన ఐలాపూర్ రైతు వెల్మ సంజీవ్ రెడ్డి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఓ రైస్ మిల్లర్ పాల్పడుతున్న భారీ తూకం మోసాలను ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు వెల్మ సంజీవ్ రెడ్డి బట్టబయలు చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లులకు విక్రయించడానికి వెళ్లినప్పుడు, కాంటా (వేయింగ్ స్కేల్) తూకంలో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. సంజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ శివారులోని ఓ...