పేరుకే పాటి చెరువు.. మట్టితో నిండిన జలాశయం!

పేరుకే పాటి చెరువు.. మట్టితో నిండిన జలాశయం! పూడికతో కుంచించుకుపోతున్న నీటి నిల్వ సామర్థ్యం.. గేట్లు లేక వృథాగా పోతున్న కొద్దిపాటి నీరు చెరువును లోతుగా తవ్వించి, ఆధునిక మరమ్మతులు చేపట్టాలి.. సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు జగిత్యాల/బుగ్గారం మండలం, నవంబర్ 24 (తెలంగాణ కెరటం ప్రతినిధి – మేడిపెల్లి గంగాధర్): ఒకప్పుడు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి ఆధారంగా నిలిచి, వ్యవసాయానికి జీవనాధారంగా ఉన్న యశ్వంతరావుపేట పాటి చెరువు నేడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారుతోందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు పెద్ద చెరువుగా గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరువు నిండా మట్టి పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా...