ఆపదలో ఉన్న కుటుంబానికి నాయకుల భరోసా.. నక్క మహేందర్‌కు పరామర్శ

ఆపదలో ఉన్న కుటుంబానికి నాయకుల భరోసా.. నక్క మహేందర్‌కు పరామర్శ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి ఆర్థిక చేయూత.. మానవత్వాన్ని చాటుకున్న నాయకులు బుగ్గారం: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం, కష్టకాలంలో బాధిత కుటుంబానికి భరోసా కల్పించడం నిజమైన సామాజిక బాధ్యతకు నిదర్శనమని పలువురు నాయకులు చాటిచెప్పారు. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన నక్క మహేందర్ గత వారం రోజులుగా పక్షవాతంతో బాధపడుతూ కరీంనగర్ పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మహేందర్ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పలువురు నాయకులు మంగళవారం ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో...