రోడ్డు భద్రతపై ఘట్‌కేసర్ పోలీసుల అవగాహన*
*రోడ్డు భద్రతపై ఘట్‌కేసర్ పోలీసుల అవగాహన* *-అరైవ్ అలైవ్’ కార్యక్రమంతో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు* (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 24: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఘట్‌కేసర్ పోలీసులు సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట్ ఎక్స్ రోడ్డు వద్ద ఘట్‌కేసర్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, ట్రాఫిక్ ఏఎస్‌ఐ, పోలీస్ సిబ్బంది కలిసి ‘అరైవ్ అలైవ్’ పేరుతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలతో పాటు ముఖ్యంగా విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్...