ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.. బాధితులకు సకాలంలో పరిహారం అందించాలి (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్‌ ప్రతినిధి/నవంబర్ 24: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. కీసర డివిజన్‌లో ఆర్డీఓ వెంకట్ రెడ్డి అధ్యక్షతన, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గోపీచంద్ కన్వీనర్‌గా డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు...