బీర్పూర్ రోడ్ మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా ఆటో యూనియన్ నాయకులు
బీర్పూర్ రోడ్ మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా ఆటో యూనియన్ నాయకులుజగిత్యాల జిల్లా బీర్పూర్ లో నిర్వహించిన శ్రీ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు దేవర శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మడపతి ఉదయ్, ఎండీ పాషా, గంగాధర్, అంజన్న, గ్రామ సర్పంచ్ హరీష్, తిరుమల రాజేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోటి కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు.