ఔషాపూర్ విల్లాస్‌లో భారీ చోరీ

ఔషాపూర్ విల్లాస్‌లో భారీ చోరీ 40 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.1.75 లక్షల నగదు అపహరణ (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 24: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ జగత్‌స్వప్న విల్లాస్‌లో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లిన విషయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు విల్లాలోకి చొరబడి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. వివరాల్లోకి వెళితే.. విల్లాస్‌లోని 18వ నంబర్ విల్లాలో నివాసముంటున్న దివ్యకొలు విజయలక్ష్మి (53) తన మామగారు మరణించడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 9వ తేదీన స్వగ్రామానికి వెళ్లారు....