గ్రామ అభివృద్ధి పనులపై డీఎల్‌పీఓ క్షేత్రస్థాయి పరిశీలన
గ్రామ అభివృద్ధి పనులపై డీఎల్‌పీఓ క్షేత్రస్థాయి పరిశీలన ఇంకుడు గుంతలు, మహిళా భవనం, ఇందిరమ్మ జీవిత బీమా పథకం పనులపై ఆరా కౌడిపల్లి తెలంగాణ కెరాటం నవంబర్ 24 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకటాపూర్ ఆర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను డీఎల్‌పీఓ సురేష్ బాబు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతల పనులు, మహిళా సమైక్య భవనం, గ్రామపంచాయతీ భవనం, సీఎస్‌సీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు, నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగకరమని, వాటిని సక్రమంగా వినియోగంలోకి...