భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం జగిత్యాలలో అభివృద్ధి ఉందా.. అవినీతి ఉందా..? చర్చకు సిద్ధం చైర్ పర్సన్ తీరుపై బిజెపి నాయకుల ధ్వజం  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : బీజేపీ నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జగిత్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు కాశెట్టి తిరుపతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. భోగ శ్రావణిపై విమర్శలు చేసే ముందు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని ఆపండి అని అన్నారు. జిల్లాలో 2,400 మంది చేనేత కార్మికులు పింఛన్ల కోసం...