వెల్మకన్న ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
వెల్మకన్న ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం కౌడిపల్లి తెలంగాణ కేరాటం నవంబర్ 24 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రాయగిరి వేంకటేశ్వర స్వామి, శ్రీ మల్లికార్జున స్వామివార్ల ఆలయాలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఎమ్మెల్యే స్వామివార్లకు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ...