ప్రొబేషనరీ డీఎస్పీలకు పోలీస్ విధులపై దిశానిర్దేశం చేసిన వరంగల్ సీపీ ఎన్.శ్వేత
ప్రొబేషనరీ డీఎస్పీలకు పోలీస్ విధులపై దిశానిర్దేశం చేసిన వరంగల్ సీపీ ఎన్.శ్వేత హన్మకొండ ప్రతినిధి : తెలంగాణ కెరటం నవంబర్ 24 ఇటీవల డీఎస్పీల నియామకాల్లో ఎంపికైన వారిలో ఐదుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 వారాల పాటు నిర్వహించనున్న ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ ప్రొబేషనరీ డీఎస్పీలతో మాట్లాడి, శిక్షణ కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పోలీస్ శాఖ పనితీరుపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణ, నేరాల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి...