గుంతలమయంగా ఖమ్మం–ఇల్లందు రహదారి.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!
తెలంగాణ కెరటం న్యూస్ గుంతలమయంగా ఖమ్మం–ఇల్లందు రహదారి.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! సీతారామపురం, సింగరేణి మండలం: ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారి సీతారామపురం గ్రామ సమీపంలో తీవ్రంగా దెబ్బతిన్నది. రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, తారు రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించుకుంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో గుంతలు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు రహదారి దుస్థితితో ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే...