కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా!
జిల్లాలగూడ శివాలయంలో 365 దీపాల వెలుగులు.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం! జిల్లాలగూడ, నవంబర్ 24:కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలగూడలోని శివాలయంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.కార్తీక పౌర్ణమి విశిష్టతను చాటుతూ ఆలయ ప్రాంగణంలో 365 దీపాలను భక్తులు భక్తిపూర్వకంగా వెలిగించారు. వందలాది దీపాల కాంతులతో శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దీపాల వెలుగులు, శివనామస్మరణ, భక్తుల హరహర మహాదేవ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.365 దీపాలను వెలిగిస్తూ ఏడాది పొడవునా ఆ పరమశివుడి కరుణాకటాక్షాలు తమ కుటుంబాలపై ఉండాలని, ప్రజలందరికీ...