రామప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం

ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు.కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దీపాల వెలుగులతో రామప్ప ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా..భక్తుల సందడి నెలకొంది. ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో శివభక్తులు రామప్ప దేవాలయానికి తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ అర్చకులు భక్తులకు ప్రత్యేక పూజలు,అభిషేక కార్యక్రమాలు నిర్వహించి...