ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సిఎం సహాయ నిధి అండ

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క ములుగు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24:ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్య మంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థికసాయం చెక్కులను లబ్ధిదారులకు పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద,మధ్య తరగతి కుటుంబాలకు సిఎం సహాయనిధి ఎంతో తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా...