మల్లూరు శివాలయంలో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం
శివనామస్మరణతో మారుమోగిన మల్లూరు శివాలయం. జ్వాలా తోరణం కార్యక్రమం తో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శివాలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా మంగళవారం జ్వాలా తోరణం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా భక్తుల సందడి నెలకొంది. మండలం లోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో శివభక్తులు మల్లూరు శి వాలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ...