కాంగ్రెస్ పార్టీ నాయకుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన- చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25:(తెలంగాణ కెరటం)సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సంఘంలో రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను పూలమాలలతో అభినందించి, ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, రాయపోల్ మండల మాజీ అధ్యక్షులు తప్పెట సుధాకర్ ముదిరాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు,...