చేనేత కార్మికులకు, అర్హులైన వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయించండి

మంత్రి అడ్లూరిని కోరిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 25 : చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, 59 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులకు కొత్త ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి లక్ష్మణ్ బుధవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వయస్సు పైబడటం, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా...