జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ని మర్యాదపూర్వకంగా కలిసిన ట్రైనీ డీఎస్పీలు
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 2025 గ్రూప్-1 నియామక ప్రక్రియలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లుగా ఎంపికైన ఐదుగురు అధికారులు శిక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఇటీవల విధుల్లో చేరగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ట్రైనీ డీఎస్పీలు శాంతన్ కుమార్ రెడ్డి, సాయి ప్రత్యూష్ రెడ్డి, సబిత, ఆంజనేయులు, యశస్విని ఉన్నారు.