భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి
రీసర్వే ద్వారా భూముల విస్తీర్ణంపై రైతులకు స్పష్టమైన వివరాలు అందించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్లో భూములు కొలతలు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూ విస్తీర్ణాన్ని రీ సర్వే చేశారని, ఇంకా ఎంత మిగిలి ఉందని, ఎన్ని రోజుల్లో రీ సర్వే పూర్తి చేస్తారని, భూముల కొలతల విధానం, సాంకేతిక పరికరాల వినియోగం తదితర అంశాలను సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...