వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 25: ఘట్‌కేసర్ సర్కిల్‌లోని ఎల్ కన్వెన్షన్‌లో కాంట్రాక్టర్ శ్యామల ముత్యాలు కుమారుని వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, ఘట్‌కేసర్ సహకార సంఘం మాజీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, జేఈసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు సోమసాని రమేష్, మేడ్చల్–మల్కాజిగిరి బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి ఎండీ సిరాజ్, బానుక నవీన్, లక్ష్మయ్యతో పాటు కుటుంబ సభ్యులు,...