దుబ్బాక–బాసర ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి -డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేసిన మచ్చ శ్రీనివాస్
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25:(తెలంగాణ కెరటం)దుబ్బాక నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా బాసరకు గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని తెలంగాణ వర్కర్స్ యూనియన్ దుబ్బాక ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు దుబ్బాక ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.గతంలో దుబ్బాక డిపో నుంచి బాసరకు నడిచిన బస్సు సర్వీసు ద్వారా ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, భక్తులు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించేవారని తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సర్వీసును నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ముఖ్యంగా విద్యార్థులు విద్యాభ్యాసం కోసం, వ్యాపారులు తమ వ్యాపార అవసరాల...