దుబ్బాక–సిద్దిపేట మధ్య షటిల్ బస్సు సర్వీసు ప్రారంభించాలి -రాత్రి హాల్ట్ బస్సు సర్వీసును పునఃప్రారంభించాలి
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25,(తెలంగాణ కెరటం)దుబ్బాక నుంచి సిద్దిపేటకు ధర్మాజీపేట మీదుగా షటిల్ బస్సు సర్వీసును ప్రారంభించాలని, గతంలో అందుబాటులో ఉన్న రాత్రి హాల్ట్ బస్సు సర్వీసును తిరిగి పునఃప్రారంభించాలని కోరుతూ ధర్మాజీపేట స్థానిక కౌన్సిలర్లు మెరుపుల సాయి కుమార్ గౌడ్, గోవిందుగారి శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి టీజీఎస్ఆర్టీసీ దుబ్బాక డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ ధర్మాజీపేట మీదుగా దుబ్బాక–సిద్దిపేట మధ్య సరైన బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని షటిల్ బస్సు సర్వీసును ప్రారంభించాలని కోరారు. అలాగే గతంలో నడిచిన...