ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా – ఇందిరమ్మ కుటుంబ బీమా.-అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్.

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25,(తెలంగాణ కెరటం)రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా నిలవనుందని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్ అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబంలోని ఒక సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు....