ఘట్‌కేసర్‌లో ఘనంగా ఆత్మీయ ఫెలోషిప్ కార్యక్రమం

ఘట్‌కేసర్‌లో ఘనంగా ఆత్మీయ ఫెలోషిప్ కార్యక్రమంపాస్టర్లు, క్రైస్తవ నాయకుల ఐకమత్యానికి వేదికగా సమావేశందేవునిపై విశ్వాసం, ఆధారపడటంపై ప్రత్యేక వాక్య సందేశం (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 25: ఘట్‌కేసర్ మండల పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ (జీఎంపీఎల్ఏ) ఆధ్వర్యంలో నవంబర్ 24న అన్నోజిగూడలోని న్యూ లైఫ్ కవెనెంట్ ఏజీ చర్చిలో ఆత్మీయ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ సంఘ పెద్దలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు, ఆరాధన, వాక్య సందేశంతో ఆత్మీయ ఐకమత్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి న్యూ లైఫ్ కవెనెంట్ ఏజీ చర్చి పాస్టర్ రెవ. డి. శ్రీ సంజయ్ వేదికతో పాటు...