బిఆర్ఎస్ లో భారీగా చేరికలు
వనపర్తి: బిఆర్ఎస్ లో భారీగా చేరికలువనపర్తి జిల్లా బ్యూరో చీఫ్ నవంబర్ 25 వనపర్తి పట్టణంలోని 19,20వ వార్డులకు చెందిన బీజేపీ,కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల నుంచి సుమారు 300 మంది యువకులు, మహిళలు మాజీమంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలోతో ప్రజలు విసిగిపోయారని, కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.