రేపటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే.
రేపటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25): రేపు గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా మండలం పరిధిలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.భారీ బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రానున్న వేళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దిమడుగు శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంతు సేవాలాల్ విగ్రహ...