అచ్చంపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం.

అచ్చంపేటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం. హామీలు అమలు చేయకుండా సీఎం ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు? స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పాలి. ఎడెల్లి ఆంజనేయులు మాదిగ డిమాండ్. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25): తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించదగిన విషయమే. అయితే అచ్చంపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాల పేరుతో పర్యటనలు చేయడం...