రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ

రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ*.  సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26): 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు.రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కులు కల్పించింది. కులం, మతం, ప్రాంతం, భాష అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం స్పష్టం చేసింది. అణగారిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు,...