గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు - కొండగట్టులో కలెక్టర్, ఎస్పీ తనిఖీ

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు - కొండగట్టులో కలెక్టర్, ఎస్పీ తనిఖీ కొండగట్టు (మల్యాల మండలం, జగిత్యాల) - ప్రతినిధి బి. రఘు:  ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కొండగట్టు, జేఎన్టీయూ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ శాఖలు చేపడుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా హెలిప్యాడ్ వద్దకు...