విద్యార్థులకు కనీస వసతులు కరువు.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

విద్యార్థులకు కనీస వసతులు కరువు.. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు - న్యాయ విద్యార్థి చెలిమెల మణివర్ధన్ తెలంగాణ కెరటం మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలురకు కనీసం టాయిలెట్ల సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంపై న్యాయ విద్యార్థి చెలిమెల మణివర్ధన్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కులో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకతను తన...