పత్తి పంట మాటున గంజాయి సాగు.. రూ.28.46 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
📌నిందితుడి అరెస్ట్.. నిర్మల్ పోలీసుల ‘గంజాయి గస్తీ’తో అక్రమ సాగుకు చెక్ నిర్మల్ జిల్లా పోలీసుల ‘గంజాయి గస్తీ’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. మామడ మండలం తండ్ర గ్రామ పరిధిలోని ధన్జీనాయక్ తండా శివారులో పత్తి పంట మాటున అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కున్సోత్ రవి (43) అనే రైతును అరెస్ట్ చేశారు.పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 204 పచ్చి గంజాయి మొక్కలు, 54 ఎండిన గంజాయి మొక్కలు, 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.28.46 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.అధిక ఆదాయం సంపాదించాలనే ఉద్దేశంతో పత్తి పంటతో పాటు అంతర పంటగా...