జీనియస్ క్వెస్ట్‌లో ఫైనల్‌కు వెల్దుర్తి విద్యార్థి

తెలంగాణ కెరటం) వెల్దుర్తి నవంబర్ 26: వెల్దుర్తి: జీనియస్ క్వెస్ట్-2026 జిల్లాస్థాయి పోటీల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి 10వ తరగతి విద్యార్థి నాసర్ మోహియోద్దీన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.మెదక్ జిల్లాస్థాయి జీనియస్ క్వెస్ట్ క్విజ్ పోటీలను ఈరోజు కె.జి.బి.వి మెదక్‌లో నిర్వహించారు. మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన నాసర్, జిల్లాస్థాయి సెమీఫైనల్‌లోనూ గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు.డిసెంబర్ 2న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే జిల్లాస్థాయి ఫైనల్ పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించాలని ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.