బుగ్గారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి – ఎస్పీ
బుగ్గారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి – ఎస్పీ బుగ్గారం: జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ బుగ్గారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్స్‌కు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించి, కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో...